అవధారు రఘుపతి అందరిని చిత్తగించు ఇవలనుండే కొలువిదెనదె సముఖాన
రామరాఘవరామ రామచంద్రప్రభో శ్రీమదయోధ్యాపతి సీతాపతి
ప్రేమనారదుడు పాడిపెక్కు రంభాదులాడేరు మోమెత్తి కవులెల్ల మ్రొక్కేరదివో
ఇనవంశకుల జాత ఇక్ష్వాకుకుల తిలక ఘనదశరథసుత కౌశికప్రియ
మునులు దీవించేరు ముందట భరతుడదె వెనకలక్ష్మణుడు సేవించె వింజామర
కందువకౌసల్యాగర్భ రత్నాకర చెందిన శ్రీవేంకటాద్రి శ్రీనివాస
సందడి కుశలవులు చదివేరు వొకవంక చెంది నీరాజనము చెప్పరాదు రామ
No comments:
Post a Comment