అదివో నిత్యసూరులు అచ్యుత నీదాసులు యెదురులేనివారు యేకాంగవీరులు
రచ్చల సంసారమనేరణరంగములోన తచ్చి కామక్రోధాలతలలు గొట్టి
అచ్చపుతిరుమంత్రపుటారువుబొబ్బలతోడ యిచ్చలనే తిరిగేరు యేకాంగ వీరులు
మొరసి పుట్టుగులనేముచ్చు బౌజుల కురికి తెరలి నడుములకు దెగవేసి పొరి
గర్మము బొడిచి పోటుగంటుల దూరి యెరగొని తిరిగేరు యేకాంగవీరులు
వొడ్డినదేహములనేవూళ్ళలోపల చొచ్చి చెడ్డయహంకారమును చెఱలు పట్టి
అడ్డమై శ్రీవేంకటేశు నుండనుండి లోకులనే యెడ్డల జూచి నవ్వేరు యేకాంగవీరులు

No comments:
Post a Comment