శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, June 1, 2010

ఎంత మానుమన్న

ఎంత మానుమన్న జింతలేల మానునే పంతపుమనసు హరిపై నుంటేగాక

తీరనిబంధాలు నేడే తెగుమంటే నేలతెగు భారపుమమత బెడబాసినగాక
వూరటగా మమత నేనొల్లనంటే నేలమాను వోరుపుతో లంపటము లొల్లకుంటేగాక

వేకపుగోపము నేడే విడుమంటే నేలవిడు తోకచిచ్చయినయాస దుంచినగాక
ఆకట నానేలమాను అన్నిటాను యిందరికి మాకుపడి తత్తరము మరచుంటేగాక

పెట్టనిది దైవమిట్టే పెట్టుమంటె నేలపెట్టు యిట్టే వేంకటపతి యిచ్చినగాక
యిట్టునిట్టు నీతడు దానిందరికి నేలయిచ్చు వొట్టినవిరక్తి నేమీ నొల్లకుంటేగాక

No comments:

Post a Comment