శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, May 18, 2010

అహోబలేశ్వరుడు

అహోబలేశ్వరుడు అరికులదమనుడు మహా మహిమలకు మలసీవాడె

కదలు కన్నులును కరాళవదనము గుదిగొను భయదపు కోరలను
అదరు మీసములు అలరగ నవ్వుచు వుదుట తోడ కొలువున్నాడు వాడె

అతిసిత నఖములు అనంత భుజములు వితత పరాక్రము వేషమును
అతుల దీర్ఘజిహ్వయు కడు మెరయగ మితిలేని కరుణ మెరసీ వాడు

సందడి సౌమ్యములు శంఖచక్రములు పొందుగ దివిజులు పొగడగను
ఇందిర దొడపై నిడి శ్రీవేంకట మందు నిందు కడు అలరీ వాడే

No comments:

Post a Comment