శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, May 30, 2010

ఈతడే

ఈతడే రఘురాముడీతడేకాంగవీరుడు యీతడు చేసిన చేత లెన్నియైనా కలవు

ఖరదూషణాదులను ఖండతుండముల సేసె అరుదుగా వాలి నొక్కయమ్మున నేసె
సరవి కొండలచేత సముద్రము బంధించె ఇరవై విభీషణునికిచ్చె లంకారాజ్యము

కూడపెట్టె వానరుల, కుంభకర్ణాదిదైత్యుల తోడనే రావణుజంపె దురము గెల్చె
వేడుకతో సీతాదేవి కూడెను పుష్పకమెక్కె యీడు జోడై సింహాసన మేలె నయోధ్యలోన

పుడమియంతయు గాచె పొందుగా తనంతలేసి కొడుకుల గాంచెను కుశలవుల
యెడయక శ్రీవేంకటేశుడై వరములిచ్చె అడరి తారకబ్రహ్మమై ఇదె వెలసె

No comments:

Post a Comment