ఈసుర లీమును లీచరాచరములు యిసకలమంతయు నిది యెవ్వరు
ఎన్నిక నామము లిటు నీవై యుండగ యిన్ని నామము లిటు నీవై యుండగ
వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు
వొక్కరూపై నీవు వుండుచుండగ మరి తక్కిన యీరూపములు తామెవ్వరు
యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ మక్కువ నుండువారు మరి యెవ్వరు
శ్రీవేంకటాద్రిపై చెలగి నీ వుండగా దైవంబులనువారు తామెవ్వరు
కావలసినచోట కలిగి నీవుండగ యీవిశ్వపరిపూణు లిది యెవ్వరు
No comments:
Post a Comment