శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, June 5, 2010

ఒకటికొకటిగూడ

ఒకటికొకటిగూడ దోయమ్మ నీయందే సకలము నెటువలె సంతసేసితివే

తానకు నీ కుచాలు దంతికుంభల బోలితే యీ నడుము సింహమునేల పోలెనే
అనివట్టి నీ కన్ను లంబుజాల బోలితేను అననము చందురుని నదియేల పోలెనే

అతివ నీచేతులు బిసాంగముల బోలితేను యితవై నడపు హంసనేల పోలెనే
చతురత నాసికము సంపెంగ జోలితేను తతి నీకురులు తుమ్మెదలనేల పోలెనే

నేవళపు నీయారు నీలాహి బోలితేను యీవల మేను మెరుపునేల పోలెనే
శ్రీ వేంకటేశు మొవి చిన్ని కెంపులంతించి ఆవేళ దంతాలు వజ్రాలై యెట్టువోలెనే

No comments:

Post a Comment