చెల్లబో తియ్యనినోర జే దేటికి యి పల్లదపుగొరికలపాలు సేయవలెనా
అసలకు నాదేహ మమ్ముకొంటి వింటింట దాసునిగా నాపాలిదైవమా నీవు
పోసరించి భూమిలోన బుట్టించి రక్షించి యీసులేక భంగపెట్టు టిది గొంత వలెనా
పామరపుటింద్రియాలబారి దోసితివి నన్ను దామెనకట్టుగా గట్టి తత్వమా నివు
దోమటి నామతిలోన దొడునీడవై యుండి పామేటిసుఖములనే భ్రమయించాలెనా
గక్కన నింతట నన్ను గరుణించితివి నేడు మొక్కితి శ్రీవేంకటాద్రిమూలమా నీకు
దిక్కు దెసవై నాకు దేవుడవై యేలికవు చొక్కి నామన సింత సోదించవలెనా
No comments:
Post a Comment