చూతమే యీ సంతోసాలు సొరిదినుండి ఐతేనేమే సవతుల మది మనమేలే
సతి తిట్టులతనికి చవులై వుండగాను మతిలోన వగవగ మనకేల
యితవై యీపె గుంపెన కితడు లోగుచుండగా కుతిల కుడువ నేలే కొమ్మలాల మనము
ఆపెసేసే ఉద్దండాలు ఆతడోరుచుకుండగా కోపమేలే మనకును కోపులనుండి
వోపి యాలియాజ్ఞ మగడొట్టి జవదాటడు ఆపసోపాలేలే మనమందరిలో వారము
కొంగాపెవట్టి తియ్యగా కూచుండాతడు లోగాగా పంగించనేలే మనము పలుమారును
యెంగిలిమోవిచ్చె నాపె యెనసి శ్రీ వేంకటేశు డంగదేలేయేలిద్దరట్టే మనములను
No comments:
Post a Comment