శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Wednesday, July 21, 2010

రెండుమూలికలు

రెండుమూలికలు రేయిబగలు నున్నవి అండదేహమం దొకటి ఆతుమలో నొకటి

యిదివో రసబద్ధము యింద్రియములు మేనిలో పదిలముగా నిలిపి బంధించుట
అదివో వేధాముఖ మంతరంగపుమనసు చెదరకుండా జొనిపి శ్రీహరిదలచుట

తారవిద్య గంటిమి తగిలి నాసాగ్రమందు మేరతో ద్రిష్టినిలిపి మేలుబొందుట
చేరువ సువర్ణవిద్య చిత్తములో బ్రణవము ధీరత నాదముసేసి దేవుని బొగడుట

పుటజయమాయ నిట్టె పుణ్యపాపము లందులో కుటిలపుగోరికల కొన దుంచుట
యిటులనే శ్రీవేంకటేశు డిందిరయును అటు ప్రకృతిపురుషునుటొరవచ్చుట

No comments:

Post a Comment