శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, May 30, 2010

ఎండలోనినీడ

ఎండలోనినీడ యీమనసు పండుగాయ సేయబనిలేదు మనసు

వానచేతకములవలెనాయ మనసు గోనెబట్టిన బంకగుణమాయ మనసు
మానజిక్కినకోలమతమాయ మనసు తేనెలోపలి యీగతెరుగాయ మనసు

గడిరాజుబదుకాయ కడలేని మనసు నడివీది పెసరాయ నయమైనమనసు
గడకుగట్టిన పాతగతిదోచె మనసు అడసులోపలి కంబమై తోచెమనసు

తెరువుచూపినజాడ దిరుగు నీమనసు మరుగుజేసినచోట మరుగు నీమనసు
తిరువెంకటేశుపై దిరమైన మనసు సిరిగలిగినచోట జేరు నీమనసు

No comments:

Post a Comment