శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, May 30, 2010

ఎంత చదివి

ఎంత చదివి చూచిన నీతడే ఘనముగాక యింతయు నేలేటిదైవ మిక వేరే కలరా

మొదల జగములకు మూలమైనవాడు తుద ప్రళయమునాడు తోచేవాడు
కదిసి నడుమ నిండి కలిగివుండెడివాడు మదనగురుడేకాక మఱి వేరే కలరా

పరమాణువైనవాడు బ్రహ్మాండమైనవాడు సురలకు నరులకు జోటయినవాడు
పరమైనవాడు ప్రపంచమైనవాడు హరి యొక్కడేకాక అవ్వలను గలరా

పుట్టుగులయినవాడు భోగమోక్షాలైనవాడు యెట్టనెదుర లోనను యిన్నిటివాడు
గట్టిగా శ్రీ వేంకటాద్రి కమలాదేవితోడి పట్టపుదేవుడేకాక పరులిక గలరా

No comments:

Post a Comment