ఎంత చదివిన నేమి వినిన తన చింత యేల మాను సిరులేల కలుగు
ఇతర దూషణములు ఎడసిన గాక అతి కాముకుడు గాని యప్పుడు గాక
మతి చంచలము కొంత మానిన గాక గతి యేల కలుగు దుర్గతులేల మాను
పర ధనముల యాస బాసిన గాక అరిది నిందలు లేని యప్పుడు గాక
విరస వర్తనము విడచిన గాక పర మేల కలుగు నాపద లేల మాను
వేంకటపతి నాత్మ వెదికిన గాక కింక మనసున తొలగిన గాక
బొంకు మాటలెడసి పోయిన గాక శంక యేల మాను జయమేల కలుగు
No comments:
Post a Comment