ఎంత జాణరో యీకలికి కాంతుడ నీ భోగములకే తగునూ
చెలి నీ కౌగిట చెమటలజేసెను చలువగ నిప్పుడు జలకేళి
అలరుచు గుచముల నదుముచు జేసెను పలుమరు ముదముల బర్వతకేళి
పైపై బెనగుచు బాహులతలనే వైపుగ జేసెను వనకేళి
చూపుల నీపయి సొలయుచు జేసెను పూప వసంతము పూవులకేళి
అరుదుగ నట్టివి యధరామృతముల సరిజేసెను భోజనకేళి
కరగుచు శ్రీవేంకటేశ సేసేను పరగిన రతులనె పరిణయ కేళి
No comments:
Post a Comment