ఎంత బాపనా సోద మింత గలదా అంతయు నీమహిమే హరిభట్లూ
సూరిభ ట్లొకవంక చొరనిచోట్లు చొచ్చి వారబియ్య మెత్తి యెత్తి వడదాకి
నీరువట్టుగొని భూమి నీళ్లెల్లా వారాట్టీ కేరికేరి నగాయ్యా క్రిష్ణభట్లూ
దేవరొజ్ఝ లొకవంక దిక్కులలో బొలగూడు దీవెనతో నారగించి తీవుమరిగి
యీవల బెట్టినవారి కేమైనా నొసగీని వేవేలమాయలవిష్ణుభట్లూ
సోమయాదు లొకవంక సొరిది సురలకెల్లా నామనితో విందువెట్టీ ననుదినము
హోమపువిప్రులసొమ్ము లొడిసి తా బుచ్చుకొనీ వేమరు శ్రీవేంకటాద్రివెన్నుభట్లూ
No comments:
Post a Comment