ఎంత బోధించి యేమిసేసిన దన దొంతికర్మములు తొలగీనీ
సతతదురాచారజడునకు బుణ్యసం గతి దలపోసిన గలిగీనా
అతిపాపకర్మబోధకుడై వెలయుదుష్టు మతి దలపోసిన మరి కలిగీనా
బహుజీవహింసాపరుడైనవానికి యిహపరములు దైవ మిచ్చీనీ
విహితకర్మములువిడిచినవానికి సహజాచారము జరిగీనా
దేవదూషకుడై తిరిగేటివానికి దేవతాంతరము దెలిసీనా
శ్రీవేంకటేశ్వరు జింతింపకుండిన పావనమతియై బ్రతికీనా
No comments:
Post a Comment