శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, May 30, 2010

ఎంత భక్తవత్సలుడ

ఎంత భక్తవత్సలుడ విట్టుండవలదా వింతలు నీసుద్దులెల్లా వినబోతే నిట్టివే

యిల నసురారియనేయీబిరుదు చెల్లె నీకు బలివిభీషణాదులపాలికే చెల్లదు
కెలసి అవులే నీవు గెలుతు వెందరినైనా తలచి చూడ నీదాసుల కోడుదువు

ఇందరపాలిటికిని యీశ్వరుడ వేలికవు పందవై యర్జునుబండిబంట వైతివి
వందనకు నౌలే దేవతలకే దొరవు అందపునీదాసులకు నన్నిటా దాసుడవు

కడుపులో లోకముకన్నతండ్రి విన్నిటాను కొడుకవు దేవకికి గోరినంతనే
తడవితే వేదములు తగిలేబ్రహ్మమవు విడువనిమాకైతే శ్రీవేంకటాద్రిపతివి

No comments:

Post a Comment