శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, May 24, 2010

ఈ జీవునకు నేది

ఈ జీవునకు నేది గడపల తనకు నేజాతియును లేక యిట్లున్నవాడు

బహుదేహ కవచముల బారవేసినవాడు బహుస్వతంత్రముల నాపదనొందినాడు
బహుకాలముల మింగి పరవశంబైనవాడు బహు యోనికూపములబడి వెడలినాడు

పెక్కుబాసలు నేర్చి పెంపుమిగిలినవాడు పెక్కునామములచే బిలువబడినాడు
పెక్కుకాంతలతోడ పెక్కుపురుషులతోడ పెక్కులాగుల బెనగి చెండుపడినాడు

ఉండనెన్నడు దనకు ఊరటెన్నడులేక యెండలకు నీడలకు యెడతాకినాడు
కొండలలో నెలకొన్న కోనేటిరాయని యండ జేరెదననుచు నాసపడినాడు

No comments:

Post a Comment