శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Monday, May 24, 2010

ఈ పాదమే కదా

ఈ పాదమే కదా ఇలయెల్ల గొలిచినది ఈ పాదమే కదా ఇందిరా హస్తముల సితవైనది

ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది ఈ పాదమే కదా ఈ గగనగంగ పుట్టినది
ఈ పాదమే కదా యెలమి పెంపొందినది ఈ పాదమే కదా ఇన్నిటికిని యెక్కుడైనది

ఈ పాదమే కదా యిభరాజు దలచినది ఈ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది
ఈ పాదమే కదా యీబ్రహ్మ కడిగినది ఈ పాదమే కదా యెగసి బ్రహ్మాండమంటినది

ఈ పాదమే కదా ఇహపరము లొసగెడిది ఈ పాదమే కదా ఇల నహల్యకు కోరికైనది
ఈ పాదమే కదా యీక్షింప దుర్లభము ఈ పాదమే కదా ఈ వేంకటాద్రిపై నిరవైనది


Download

No comments:

Post a Comment