ఈతడఖిలంబునకు నీశ్వరుడై సకల భూతములలోన దా బొదలువాడితడు
గోపాంగనలమెరుగు గుబ్బచన్నులమీద చూపట్టుకమ్మ గస్తురిపూత యితడు
తాపసోత్తముల చింతాసౌధములలోన దీపించు సుజ్ఞానదీప మితడు
జలధికన్యాపాంగ లలితేక్షణములతో కలసి వెలుగుచున్న కజ్జలంబితడు
జలజాసనుని వదనజలధి మధ్యమునందు అలర వెలువడిన పరమామృతంబితడు
పరివోని సురతసంపదల నింపులచేత వరవధూతతికి పరవశమైన యితడు
తిరువేంకటాచలాధిపుడు దానె యుండి పరిపాలనముసేయు భారకుండితడు
No comments:
Post a Comment