శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Saturday, May 29, 2010

ఈతగవే నాకు

ఈతగవే నాకు నీకు నెంచి చూచితే కాతరపుజీవులకు గలదా వివేకము

భారము నీదిగనక పలుమారు బాపములే చేరి మొక్కలాన నే జేసితిని పేరడి దల్లిదండ్రులు బిడ్డ లేమిసేసినాను వోరుచుక ముద్దుసేసుకుందురు లోకమున

కాన నీవుగలవని కడదాకా నేరములే వేవేలు సేసితిని వెఱవక భావించుక యింటిదొర పసురము దెంచుకొని యేవిధి బైరుమేసినా నెగ్గుసేయ డతడు

పుట్టించేవాడవు నీవు పొదలేవారము నేము యెట్టుండినా నీకు బోదు యెన్నటికిని వొట్టుక శ్రీవేంకటేశ వోడగట్టినదూలము అటునిట్టు బొరలినా నండవాయ దెపుడు

No comments:

Post a Comment