ఈడగుపెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా
పచ్చికబయళ్ళ పడతి ఆడగ ముచ్చట కృష్ణుడు మోహించి
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగ
మ్త్తెపు ముంగిట ముదిత నడువగ ఉత్తముడే చెలి వురమునను
చిత్తరవు వ్రాసి చెలగివచ్చె నొక జొత్తుమాని ఇటు జూపరుగా
కొత్తచవికెలో కొమ్మనిలిచితే పొత్తున తలబాలు వోసెనట
ఇత్తల శ్రీవేంకటేశుడు నవ్వుచు హత్తి సతిగూడె నని పాడరుగా
No comments:
Post a Comment