శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, May 30, 2010

ఈతని మహిమలు

ఈతని మహిమలు ఎంతని చెప్పెద చేతుల మ్రొక్కెద చెలగుచు నేను

శ్రీ నరసింహుడు చిన్మయ మూరితి నానా విధకర నఖరుడు
దానవ దైత్య విదారుడు విష్ణుడు తానకమగు మా దైవంబితడు

అహోబలేశుడు ఆదిమపురుషుడు బహు దేవతాసార్వ భౌముడు
సహజానందుడు సర్వరక్షకుడు ఇహపరము లొసగు యేలిక యితడు

కేవలుడగు సుగ్రీవనృసింహుడు భావించ సుజన పాలకుడితడు
శ్రీవేంకటేశుడు చిత్తజ జనకుడు వేవేలకు వేల్పు ఇతడు

No comments:

Post a Comment