శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, May 30, 2010

ఈభవమునకు జూడ

ఈభవమునకు జూడ నేది గడపల తనదు ప్రాభవం బెడలించి బాధ పెట్టించె

చెప్పించె బ్రియము వలసినవారలకునెల్ల రప్పించె నెన్నడును రానిచోట్లకును
నొప్పించె నాసలకు వోరంత ప్రొద్దునను తిప్పించె కోరికల తిరిగి నలుగడల

పుట్టించె హేయంపుభోగయోనులనెల్ల కట్టించె సంసారకలితబంధముల
పెట్టించె ఆసలను పెడకొడముల దన్ను తిట్టించె నిజద్రవ్యదీనకులచేత

బెదరించె దేహంబు పెనువేదనలచేత చెదరించె శాంతంబు చెలగి చలమునను
విదళించె భవములను వేంకటేశ్వరు గొలిచి పదిలించె నతనికృప పరమసౌఖ్యములు

No comments:

Post a Comment