శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, May 30, 2010

ఈపెకు నితడు

ఈపెకు నితడు దగు నితనికీపె దగు చూపులకు పండుగాయ శోభనము నేడు

పిలువరె పెండ్లి కూతుబెండ్లిపీటమీదకి చెలగి తానెదురు చూచీ దేవుడు
బలువుగా నిద్దరికి బాసికములు గట్టరె కలిమెల్ల మెరసి సింగారించరే

ఆతలదెచ్చి పెట్టరె ఆ పెండ్లి కూతురును యీతడే జంట సోభన మిద్దరికిని
కాతరాన బువ్వానకు గక్కన బెట్టరె మీరు రేతిట నుండియు వేగిరించేరు వీరు

పానుపు పరచరె బలునాగవల్లి నేడు పూని తెరవేయరె పోలతులాల
ఆనుక శ్రీవేంకటేశుడలమేలుమంగయును లోననె భూకాంతయును లోలువైరి తాము

No comments:

Post a Comment