శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, May 30, 2010

ఈదేహ వికారమునకు

ఈదేహ వికారమునకు నేదియు గడపల ఘనము మోదమెరంగని మోహము ముందర గననీదు

నిత్యానిత్యవివేకము నీరసునకు నొనగూడదు సత్యాలాపవిచారము జరగదు లోభికిని
హత్యావిరహిత కర్మము అంటదు క్రూరాత్మునకును ప్రత్యక్షంబగు పాపము పాయదు కష్టునకు

సతతానందవికాసము సంధించదు తామసునకు గతకల్మష భావము దొరకదు వ్యసనికిని
జితకాముడు దానవుటకు సిద్ధింపదు దుష్కర్మికి అతులితగంభీర గుణంబలవడ దధమునకు

శ్రీవేంకటగిరి వల్లభుసేవా తత్పరభావము ద్రోవ మహాలంపటులకు తోపదు తలపునకు
దేవోత్తముడగు నీతని దివ్యామృతమగు నామము సేవింపగ నితరులకును చిత్తంబొడబడదు

No comments:

Post a Comment