ఈకెకు నీకు దగు నీడు జోడులు వాకుచ్చి మిమ్ము బొగడ వసమా యొరులకు
జట్టిగొన్న నీదేవులు చంద్రముఖి గనక అట్టె నిన్ను రామచంద్రుడనదగును
చుట్టమై కృష్ణయ్యవు చూపుల యాపె గనక చుట్టుకొని నిన్ను కృష్ణుడనదగును
చందమైన వామలోచని యాపెయౌగనక అందరు నిన్ను వామనుడనదగును
చెంది యాకె యెప్పటికిని సింహ మధ్య గనక అంది నిన్ను నరసింహుడని పిల్వదగును
చెలువమైన యాపె శ్రీదేవి యగుగనక అల శ్రీవక్షుడవని యాడదగును
అలమేల్మంగ యహిరోమావళి గలదిగన యిల శేషాద్రి శ్రీవేంకటేశు డనదగును
No comments:
Post a Comment