ఎన్నాళ్ళున్నా నిట్టె కదా విన్నని వెరగులె వేడుకలాయె
భువి నెట్టున్నా బోయేదే కా చవులకు జవియగు శరీరము
ధ్రువమని యీ సుఖ దుఃఖ రోగములు భవముల కిదియే బందములాయె
ఎంత వొరలినా నిదే తాగద కంతల కంతల కాయమిది
బొంత దగలుచుక పొరలగ బొరలగ సంత కూటములె సరసములాయె
కైపుసేసినా ఘనమౌనే కా పాపము బుణ్యము బైపై నే
యీ పుట్టుగునకు ఈ వేంకటపతి దీపించగ బెను దెరువొకటాయె
No comments:
Post a Comment