ఎన్నాళ్ళదాక దానిట్టె వుండుట బుద్ధి కన్నపోవుట పూర్వకర్మశేషం
కలకాలమెల్ల దుఃఖమెకాగ బ్రాణికిని వలదా సుఖము గొంతవడియైనను
కలుషబుద్ధుల బ్రజ్ఞగల దింతయును మంట గలసిపోవుటే పూర్వకర్మశేషం
జాలి తొల్లియుబడ్డజాలె నేడునుగాక మేలు వొద్దా యేమిటినై నాను
తాలిమిలో హరి దలచక యెఱుకెల్ల గాలిబోవుట పూర్వకర్మశేషం
తరగనినరకపుబాధయు నేడునుగాక దరి చేరవలదా యింతటనైనను
తిరువేంకటాద్రిపైదేవుని గొలువక గరివడే భవమెల్ల కర్మశేషం
No comments:
Post a Comment