ఎన్నడొకో నే దెలిసి యెక్కుడయి బ్రదికేది పన్నిననాగుణమెల్లా భ్రమత పాలాయ
ధనమద మిదె నన్ను దైవము నెఱ గనీదు తనుమద మెంతయిన తపము జేయనీదు
ఘన సంసారమదము కలుషము బాయనీదు మవెడినామనువెల్ల మదముపాలాయ
పొంచి కామాంధకారము పుణ్యము గానగనీదు కంచపుజన్మపుచిక్కు గతి చూపదు
పెంచి యజ్ఞానతనము పెద్దల నెరగనీదు చించరానినాబుద్ది చీకటిపాలాయ
శ్రీ వేంకటేశ్వరమాయ చిత్తము దేరనీదు యేవంకా నీతడే గతి యిన్నిటా మాకు
యేవుపాయమును లేక యీతని మఱగు చొచ్చి దేవుడంతర్యామి యని తేజము బొందితిమి
No comments:
Post a Comment