ఎన్నడు విజ్ఞానమిక నాకు విన్నపమిదె శ్రీవేంకాటనాథ
బాసిన బాయవు భవబంధములు ఆస ఈ దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు
కొచ్చిన కొరయవు కోపములు గచ్చుల గుణములు గలిగినన్న్నాళ్ళు
తచ్చిన తగలవు తహ తహలు రచ్చల విషయపు రతులన్నాళ్ళు
ఒకటి కొకటికిని ఒడబడవు అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే శరణంటే ఇక వికటము లణగెను వేడుక నాళ్ళు
No comments:
Post a Comment