శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 4, 2010

ఎన్నడు మంచివాడ

ఎన్నడు మంచివాడ నయ్యేను నేను నన్ను నీవే మన్నించి నడుపవే దయివమా

వేపమానికిని చేదు విడువక వుండేది యేపొద్దు సహజమే యెంతైనాను
పాపపుణ్యలంపటాన బరగింవుండేటినేను చాపలదుర్గుణినౌట సహజమే

పాముకు విష మెప్పుడు పండ్ల బెట్టుకుండేది భూమిలో సహజమే పొరి నెంతైనా
కామక్రోధుడ నాకు గరుణ యించుక లేక సామజపుదుర్మదము సహజమే

అటుగాన శ్రీ వేంకటాధిప నాకిక వేరే తటుకన నేడు శాంతము వచ్చీనా
ఘటన నీకృపయందుగలిగిన మేలు నాపై తటుకన ముంచి నన్ను దరిచేర్పవే

No comments:

Post a Comment