ఎన్నడు పక్వము గా దిదె యింద్రియభోగంబులచే సన్నము దొడ్డును దోచీ సంసారఫలంబు
తిత్తితో నూరేండ్లకును దేహము పండగబండగ చిత్తంబెన్నడు పండక చిక్కెను కసుగాయై
పొత్తులపుణ్యముబాపము పులుసును తీపై రసమున సత్తు నసత్తును దోచీ సంసారఫలంబు
వెదవడి పుత్రులుపౌత్రులే విత్తులు లోలో మొలచియు పొది గర్మపుపూ మారదు పూపిందెయిన దిదే
తుదనిదె సుఖమును దుఃఖము తోలును గింజయు ముదురుక చదురము వలయము తోచీ సంసారఫలంబు
వినుకలిచదువుల సదలో వేమరు మాగగ బెట్టిన ఘనకర్మపుటొగ రుడుగదు కమ్మర పులిగాయై
మనుమని శ్రీవేంకటేశుకు మహినాచార్యుడు కానుక చనవున నియ్యగ వెలసెను సంసారఫలంబు
No comments:
Post a Comment