శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 4, 2010

ఎన్నడు దీరీ

ఎన్నడు దీరీ నీతెందేపలు పన్నిన జీవులబంధములు

భారపుజిత్తము ప్రవాహరూపము వూరెటిమదములు వీటెత్తె
తీర వింద్రయపుదేహభ్రాంతులు కోరేటికోర్కుల గొండలు వెరిగె

ఉడికేటిపాపము లుగ్రనరకములు తొడికేటికర్మము తోడంటు
విడువవు భవములు వెంటవెంటనే చిడుముడి జిత్తము చీకటి వడెను

రపణపుభవములు రాట్నపుగుండ్రలు చపలపుబుద్దులు జలనిధులు
ఇపుడిదె శ్రీవేంకటేశుడ నీవే కపటమువాయగ గరుణించితివి

No comments:

Post a Comment