శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 4, 2010

ఎన్నడు జెడని

ఎన్నడు జెడని యీవులిచ్చీని మాధవుడు పన్నిన యాస లితనిపైపై నిలుపవో

కొననాలుకా! హరిగుణములే నుడుగవో మనసా! ఆతని దివ్య మహిమెంచవో
తనువా! శ్రీపతి తీర్థదాహమే కోరవో యెనలేని అడియాస లేటికి నీకికను

వీనులారా! యేపొద్దు విష్ణుకథలే వినరో ఆనినచేతు లితనికంది మొక్కరో
కానుక చూపులాల కమలాక్షు జూడరో యీ నేటి పాపాల బారినేల పడేరికను

నలిబాదాలాల! హరి నగరికే నడవరో కలభక్తి యాతనిపై ఘటియించరో
చలమా! శ్రీవేంకటేశు సంగతినే వుండవో యెలయింపు గోరికలకేల పారేవికను 

No comments:

Post a Comment