శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 27, 2010

నీయంతటివా రెవ్వరు

నీయంతటివా రెవ్వరు నీకు నెదురేది యెందు చాయల నీసుద్ది విని శరణంటి నేను

కావలెనంటే దొల్లి కంభము చించుకవెళ్ళి కైవశమై ప్రహ్లాదు గావవా నీవు
తేవలనంటే బ్రహ్మ దేవునికి వేదములు సోవల సముద్రమయిన చొచ్చి తేవా నీవు

పట్టియెత్తవలెనంటే బాతాళాన బడ్డకొండ తట్టియెత్తి పాలవెల్లి దచ్చవా నీవు
మట్టుపెట్టవలె నంటే మరి భూమి చాపగాగ చుట్టుకపోతే దెచ్చి సొంపుగ నిలుపవా

పక్షపామయ్యేనంటే బాండవుల గెలుపించి యీక్షితి యేలించి చనవియ్యవా నీవు
రక్షించేనంటే గాతరాన శ్రీవేంకటాద్రి బ్రత్యక్షమై మావంటివారి దగ గరుణించవా

No comments:

Post a Comment