శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 27, 2010

నీయంత వాడనా

నీయంత వాడనా నేను నేరము లే మెంచేవు యీయెడ నిరుహేతుక కృప జూడు నన్నును

నిరతి నిన్నెఱుగను నీవు నన్నెఱుగుదువు ధర యాచకుడ నేను దాతవు నీవు
వరుస నీచుడ నేను వైకుంఠపతివి నీవు నరుడ నేను నీవు నారాయణుడవు

సారె నలసుడ నేను సర్వశక్తివి నీవు ధీరుడవు నీ వతి దీనుడ నేను
కారుణ్య మూర్తివి నీవు కఠిన చిత్తుడ నేను మేరతో నీ వేలికవు మీ దాసుడ నేను

జనక శీలుడ నేను జనకుడవు నీవు ఘనవేదాంత నిధివి కర్మిని నేను
అనిశము శ్రీ వేంకటా చలేంద్రుడవు నీవు పనుల నీ సంకీర్తన పరుడ నేను

No comments:

Post a Comment