శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Sunday, June 27, 2010

నీమహిమో

నీమహిమో నాలోన నిండిన వలపు జాడో యేమి సేతు నన్నెప్పుడు నెడపకుమయ్యా

యెనసి తో నేన యెంత పది మాటాడినా తనియదు నా మనసు తమి యెట్టిదో
వినయముతో రెప్పలు వేయక చూచినాను నినుపులై మమతలు నిచ్చ కొత్తలు

చలపట్టి నీ తోను సారె సారె బెనగిన నలయదు నా మేను ఆశ యెట్టిదో
కొలువులో నీ వద్ద గూచుండి యెంత నవ్విన తలపులో కోరికలు తరగని ధాన్యాలు

కరగి యందాకా నిన్ను గాగిలించుచుండినాను విడువవు చేతులు వేడుకెట్టిదో
అడరి శ్రీ వేంకటేశ యలమేల్ మంగను నేను తొడరి యేలితివి రతులు తరితీపులు

No comments:

Post a Comment