నీవేల సిగ్గుపడేవు నెట్టన దలవంచుక భావించి నిన్ను బైకొని మెచ్చీని
వాడలు దిరిగి నీవు వచ్చిన రాకచూచి వేడుకలు వెదచల్లీ వెలది
జాడలతో నీ మోము చంద్రకళలు చూచి వీడెపు నోటనే వేమారు బొగడీని
విదుటు దమకమున వుండే నీవునికి చూచి కదిసి నవ్వులు నవ్వీ గలికి
పొదిగిన నీశిరసు పువ్వులదండలు చూచి యెదుట నిలుచుండి చేయెత్తి మొక్కీని
గక్కున వస్తా వచ్చి కౌగిట గూడగా చూచి చెక్కులు నొక్కి నిన్ను దెలియ
నిక్కి శ్రీ వేంకటేశుడ నీ మన్ననలెల్లా జూచి పక్కన నీమీదటి పదాలు వాడీని
No comments:
Post a Comment