శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, June 29, 2010

నీవేమి సేతువయ్య

నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు భావించలేనివారి పాపమింతే కాని

పరమపద మొసగి పాపమడచేనని చరమశ్లోకమునందు చాటితివి తొలుతనె
నిరతిని భూమిలోన నీవల్ల దప్పులేదు పరగ నమ్మనివారి పాపమింతే కాని

నీపాదములకు నాకు నెయ్యమైన లంకెని యేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుత
దాపుగా నీవల్ల నింక దప్పులేదు యెంచిచూచి పైపై నమ్మినవారి పాపమింతే కాని

బంతి బురాణములను భక్తసులభుడ నని అంతరాత్మ నీమాట ఆడితివి తొలుతనే
ఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవు పంతాన నమ్మినవారి పాపమింతే కాని

No comments:

Post a Comment