నీవేకాని యింక నేనన్య మెరుగనే త్రోవజూసి నాకు తోడయ్యెద వయ్య
అపరాధ శత కోట్లయిన నీ వొక్క నెపమున ననుగావ నేరవా
అపరిమిత దురితా లైనవి యే వుపుమ చేత నన్ను ఉద్ధరించెద వయ్య
అతిశయముగ కర్మి నైతిని నీ మతము నాకొక యింత మఱపవా
ఇతర కర్మారంభ హితుడనే నాకింక గతి మోక్ష మెటువలె కల్పించెద వయ్య
తిరు వేంకటాచలాధీశ్వర నీదు శరణాగతులను బ్రోవగరాదా
పరమ దయానంద పరుడవు నీవు యే వెరవున భవములు వెడల ద్రోచెద వయ్య
No comments:
Post a Comment