శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, June 29, 2010

నీవేకా చెప్పజూప

నీవేకా చెప్పజూప నీవె నీవెకా శ్రీవిభుప్రతినిధివి సేనమొదలారి

నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద దేవతల గనిపించే దేవుడవు
యేవంక విచ్చేసినాను యిందిరాపతికి నిజసేవకుడవు నీవెకా సేనమొదలారి

పసిడిబద్దలవారు పదిగోట్లు గొలువ దెసల బంపులువంపే ధీరుడవు
వసముగా ముజ్జగాలవారి నిందరిని నీ సిసువులగా నేలిన సేనమొదలారి

దొరలైన యసురుల తుత్తుమురుసేసి జగ మిరువుగా నేలితివేకరాజ్యమై
పరగుసూత్రవతీపతివై వేంకటవిభు సిరులపెన్నిధి నీవే సేసిమొదలారి

No comments:

Post a Comment