నీవే మూలమువో నేరిచినపెద్దలకు దేవుడు నీయందులోనే తిరమాయ నిదివో
బాపురే వో దేహమా బాపురే వో నీవు వోపి నే బెట్టినకొద్ది నుందువుగా
రూపు నీవు గలిగితే రుచులెల్ల గానగద్దు చాపలాన ధర్మములు సాధింపగలదు
మెచ్చితి నోమనసా మెచ్చితివో నీవూ నా యిచ్చకొలది నెందైనా నేగుదువుగా
అచ్చపునీకతమున నవుగాము లెంచగవద్దు పచ్చిగా యేమూర్తినైనా భావించగలదు
మేలు మేలు నాలికె మేలు మేలు నీవు వోలి యేమాటకునైనా నొనరుదుగా
చాలి నీవు మెలగంగ చదువు చదువగద్దు పోలించి శ్రీవేంకటేశు బొగడగగలదు
No comments:
Post a Comment