శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, June 29, 2010

నీవే నేరవుగాని

నీవే నేరవుగాని నిన్ను బంధించేము మేము దైవమా నీకంటే నీదాసులే నేర్పరులు

వట్టిభక్తి నీమీద వళుకువేసి నిన్ను బట్టితెచ్చి మతిలోన బెట్టుకొంటిని
పట్టెడుదులసి నీపాదములపై బెట్టి జట్టిగొనిరి మోక్షము జాణలు నీదాసులు

నీవు నిర్మించిన వేనీకే సమర్పణ సేసి సోవల నికృపయెల్ల జూరగొంటిమి
భావించొకమొక్క మొక్కి భారము నీపై వేసిరి పావనపునీదాసులే వంతపుచతురులు

చెరువులనీళ్ళు దెచ్చి చేరడు నీపైజల్లి వరము వడసితిమి వలసినటు
యిరవై శ్రీవేంకటేశ యిటువంటివిద్యలనే దరిచేరి మించిరి నీదాసులే పో ఘనులు

No comments:

Post a Comment