శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, June 29, 2010

నీవే కావింక

నీవే కావింక నేనన్య మెరగ యేత్రోవ చూపి నాకు దోడయ్యెదవయ్య

అపరాధశత కోట్లయినవి వొక్క నెపమున నను గవనేరవా
అపరిమితదురితా లైనవి యే ఉపమచేత నన్ను నుద్ధరించెదవయ్య

అతిశయముగ గర్మినైతిని నీ మతము నాకొకయింత మరపవా
ఇతరకర్మారంభహితుడను గతి మోక్షమెటువలె గల్పించెదవయ్య

తిరువేంకటాచలాధీశ్వరా నీ శరణాగతుల బ్రోవజాలవా
పరమదయానందపరుడవు యే వెరవున భవములు వెడలద్రోచెదవయ్య

No comments:

Post a Comment