శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Tuesday, June 29, 2010

నీవెరగనిది లేదు

నీవెరగనిది లేదు నీయాజ్ఞ మోచితి నింతే నీవాడ నింతే హరి నేనన జోటేది

కన్నుల కెందైన జూపుకలది స్వభావము యెన్నగ నాయందు బాపమెంచజోటేది
విన్ననై చెవులకింపు వినుట స్వభావము పన్నిన కర్మాలు నన్ను బైకొన జోటేది

నాలికకు జవియైతే నమలుటే సహజము నాలి అభోజ్యపునింద నాకు బనేమి
మూల వాసనగొనేది ముక్కుకు సహజము జోలిబంధములు నన్ను జుట్టగజోటేది

కాయము కాయముపొంత గరగుటే ఆగుణము సేయనిచేతలు నాపై జెప్ప జోటేది
యీయెడ శ్రీవేంకటేశ యిన్నిటిలో నన్ను బెట్టి పాయక నాలో నుందువు పట్టగ జోటేది

No comments:

Post a Comment