శ్రీ వేంకటేశ్వర స్వామి మీద భక్తితో అన్నమాచార్యులు పాడిన కీర్తనలు.....

Pages

Friday, June 11, 2010

తలగరో లోకులు

తలగరో లోకులు తడవకురో మమ్ము కలిగినదిది మాకాపురము

నరహరి కీర్తన నానిన జిహ్వ వొరుల నుతింపగ నోపదు జిహ్వ
మురహరు పదముల మొక్కిన శిరము పరుల వందనకు బరగదు శిరము

శ్రీపతినే పూజించిన కరములు చోపి యాచనకు జొరవు కరములు
యేపున హరికడ కేగిన కాళ్ళు పాపుల యిండ్లకు బారవు కాళ్ళు

శ్రీ వేంకటపతి జింతించు మనసు దావతి నితరము దలచదు మనసు
దేవుడతని యాధీనపు తనువు తేవల నితరాధీనము గాదు

No comments:

Post a Comment