తలచిన హృదయము ఝల్లను తరుణీమణి వొయ్యారము కలిగీనా యిక నొకపరి కన్నుల జూడగను
మోమరవాంచీ పాదాంగుట మున నేలనొయ్యన వ్రాయుచును కోమలి కన్నీరెడ గ్రక్కును
వేమరు నాదెస జూచిటు వీడ్కొన నొల్లని భావము
చెక్కిట చేయిడి అలసతచే వదనము కడువాడగ వెక్కసమగు డగ్గుత్తిక వేడుక నణపుచును
అక్కర తీరగ నాతోనాడిన సొలపుల మాటలు యెక్కువ పొగలుచు ధైర్యంబేగతి నిలుపుదును
No comments:
Post a Comment