తలచినవన్నియు దనకొరకే వెలి దెలియుట దనలో దెలియుటకొరకే
ఉదయమందుట భవముడుగుటకొరకే చదువుట మేలువిచారించుకొరకే
బ్రదుకుట పురుషార్థపరుడౌటకొరకే యెదిరి గనుట తన్నెరుగుటకొరకే
తగులుట విడివడదలచుటకొరకే నొగలుట కర్మమనుభవించుకొరకే
చిగురౌట కొమ్మయి చెలగుటకొరకే బెగడుట దురితము పెడబాయుకొరకే
యీవల జేయుట ఆవలికొరకే ఆవలనుండుట యీవలికొరకే
యీవలనావల నెనయ దిరుగుటెల్ల శ్రీవేంకటేశ్వరు జేరుటకొరకే
No comments:
Post a Comment