తలప వెనక నుయ్యి తగరు ముందట దీన దొలగ నాకు దెరువుదోప దేమిసేతు
మమకారము విముక్తిమార్గదూరము నీపై మమతసేయక నాకు మనరాదు
మమత మేలో నిర్మమత మేలో దీని క్రమమునక్రమము నే గాన నేమిసేతు
కర్మమార్గము జన్మగతికి జేరువు నిష్కర్మము పాతకమునకు దొడవు
కర్మి గావలెనో నిష్కర్మి గావలెనో యీ మర్మంపుమదము మాన దేమిసేతు
శరణాగతరక్షకుడవైనయట్టి తిరువేంకటగిరిదేవుడా
పరిపూర్ణుడవో నీవు పరిచ్ఛిన్నుడవో నిన్నరసి భజింపలేనైతి నేమిసేతు
No comments:
Post a Comment